P Sudarshan Reddy : హైదరాబాద్ : మరో రెడ్డి సామాజిక వర్గానికి కీలక పదవి కట్టబెట్టింది తెలంగాణ కాంగ్రెస్ సర్కార్. ఇప్పటికే పదవుల పందేరంలో కీలక పదవులన్నీ కొందరికే కేటాయించడం పట్ల పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతోంది. అయినప్పటికీ వాటినన్నింటిని పక్కన పెడుతూ కీలక పదవిని అప్పగించింది. తాజాగా ప్రభుత్వ సలహాదారుడిగా ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డిని (P Sudarshan Reddy) నియమించింది. శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా ఆయనకు కేబినెట్ హోదా లభిస్తుందని తెలిపారు. ఆయన అన్ని ప్రధాన సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలును జిల్లా కలెక్టర్లు, శాఖల కార్యదర్శులు, సంబంధిత ఇతర అధికారులతో సమీక్షిస్తారని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
P Sudarshan Reddy Promoted
ఇదిలా ఉండగా ప్రభుత్వ సలహాదారునికి జీతం, భత్యాలు, సహాయక సిబ్బంది క్యాబినెట్ మంత్రికి ఆమోదయోగ్యమైనవి. సచివాలయంలో మంత్రుల గదులతో పాటు, సుదర్శన్ రెడ్డికి కేబినెట్ మంత్రితో సమానంగా నివాస వసతి కల్పించబడుతుంది. అన్ని క్యాబినెట్ సమావేశాలకు ఆయన ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉంటారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి ర్యాంక్ అధికారి ఫ్లాగ్‌షిప్ సంక్షేమ, అభివృద్ధి పథకాల విభాగానికి నాయకత్వం వహిస్తారని తెలిపారు. ఎప్పటికప్పుడు మంత్రివర్గానికి వివరిస్తుందని ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తెలిపారు. ప్రభుత్వం మరో వైపు ఎమ్మెల్యే కె. ప్రేమ్ సాగర్ రావును తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా క్యాబినెట్ మంత్రి హోదాతో నియమించింది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహార , పౌర సరఫరాల శాఖ తదనుగుణంగా అవసరమైన తదుపరి చర్యలు తీసుకుంటుంది.
Also Read : K Kavitha Strong Demand : పంటలను కోల్పోయిన రైతులను ఆదుకోవాలి
