Mynampally Rohit : హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ (Mynampally Rohit) షాకింగ్ కామెంట్స్ చేశారు. కల్వకుంట్ల ఫ్యామిలీని టార్గెట్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవితల మానసిక పరిస్థితి బాగో లేదన్నారు. అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎలా పడితే అలా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడే తమను ఏమీ చేయలేక పోయారని, ఇక తాము ఇప్పుడు పవర్ లో ఉన్నామన్న సంగతి మరిచి పోతే ఎలా ఎలా అని ఫైర్ అయ్యారు.
Mynampally Rohit Slams BRS Party
తమ పార్టీ బహిష్కరించిన నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకుని అదేదో తాము గొప్పలు సాధించినట్లు ప్రచారం చేసుకుంటున్నారని వారికి అంత సీన్ లేదన్నారు మైనంపల్లి రోహిత్. బీఆర్ఎస్ పార్టీ పనై పోయిందని , ఖేల్ ఖతమైందని, ఇక దుకాణం మూసు కోవాల్సిన పరిస్థితి తప్పదన్నారు. ఇంకోసారి తన గురించి కానీ తన తండ్రి గురించి కానీ కామెంట్స్ చేస్తూ తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చారు. తమ పాలనలో అందినంత మేర దోచు కోవడం చేశారని, ఆపై దోచుకున్న సొమ్మును దాచుకునేందుకు ప్రయత్నం చేశారని సంచలన ఆరోపణలు చేశారు.
మీ నిర్వాకం కారణంగానే ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన చెందారు. మీ బెదిరింపులకు, దుష్ప్రచారానికి ఎలా జవాబు చెప్పాలో తమకు బాగా తెలుసన్నారు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్. ఇక ఉపేక్షించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
Also Read : Minister Anam Warning : ప్రసన్న కుమార్ రెడ్డిపై చర్యలు తప్పవు – ఆనం

















