సంగారెడ్డి జిల్లా : మాజీ సీఎం కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఎక్కడిదని, రేవంత్ సీఎం అయ్యేవాడా అని ప్రశ్నించారు. ఆయన్ను విమర్శిస్తున్న వారంతా కెసిఆర్ కాలి గోటికి కూడా సరిపోరని సంచలన వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్ లో కెసిఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఫై కాంగ్రెస్ మూకల దాడిని తీవ్రంగా ఖండించారు. దీనిని ప్రజాస్వామ్యం పై దాడిగా ఆయన అభివర్ణించారు..కేసీఆర్ లేకుంటే తెలంగాణ ఎక్కడిది అని, గజ్వేల్ లో అభివృద్ధి జరిగేదా అని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ మీద కేసీఆర్ ఉన్నటువంటి ప్రేమ ఈ నాయకులకు ఎక్కడిదని కొత్త ప్రభాకర్ రెడ్డి నిలదీశారు.
కేంద్ర, రాష్ట్ర భవనాల్లో ప్రధానమంత్రి , రాష్ట్రపతి , ముఖ్యమంత్రి చిత్రపటాలు ఉండటం అనవాయితీగా ఉంటుందని అన్నారు. అయితే వారి చిత్ర పటాలు పెట్టదలుచుకుంటే అధికారికంగా పెట్టాలి కానీ కాంగ్రెస్ గుండాలతో కాదు కదా అని అన్నారు. రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్రతా భావంలో ఉందని, డైవర్శన్ రాజకీయాలు చేస్తూ కాలం గడుపుతున్నారని విమర్శించారు.. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు..

















