MLA Komatireddy : హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలని కొందరు తనను సామాజిక మాధ్యమాల వేదికగా లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. గురువారం రాజగోపాల్ రెడ్డి (MLA Komatireddy) మీడియాతో మాట్లాడారు. తాను దైనా రాజకీయ పరంగా నిర్ణయం తీసుకుంటే తానే ప్రకటిస్తానని, ఇందులో తాను వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు ఎమ్మెల్యే. విచిత్రం ఏమిటంటే ఆయన బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. వాళ్లే తనను అడ్డం పెట్టుకుని ఏదేదో ప్రచారం చేస్తున్నారని, ప్రజల్లో అపోహలు సృష్టించేలా చేస్తున్నారంటూ వాపోయారు. రాజకీయ పరంగా తనను ధైర్యంగా ఎదుర్కోలేకనే ఇలాంటి చవకబారు ప్రచారం మానుకోవాలని సూచించారు.
MLA Komatireddy Raj Gopal Reddy Shocking Comments
ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ భారత జట్టు మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ , ప్రస్తుతం టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్న మహమ్మద్ అజారుద్దీన్ కు కేబినెట్ లో చోటు దక్కిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించి సోషల్ , ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మాధ్యమాలలో టెలికాస్ట్ అయ్యాయి. శుక్రవారం ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని , ఇందుకు హైకమాండ్ కూడా ఓకే చెప్పిందని టాక్. ఇదే సమయంలో అజ్జూ భాయ్ తో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా కేబినెట్ లో చోటు దక్కనుందని ప్రచారం జరిగింది. దీనిపై స్పందించారు ఎమ్మెల్యే. మంత్రివర్గ విస్తరణ అనేది హైకమాండ్ తీసుకునే నిర్ణయం అన్నారు. ఒక ఎమ్మెల్యేగా, క్రమశిక్షణ గల కార్యకర్తగా మునుగోడు అభివృద్ధి కోసం కృషి చేస్తా చేస్తానని ప్రకటించారు. కాగా అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తానని చెప్పారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
Also Read : DY CM Pawan Kalyan Important Visit : దెబ్బ తిన్న పంటలను పరిశీలించిన పవన్ కళ్యాణ్


















