MLA Kolikapudi : విజయవాడ : అధికార టీడీపీ లో కొలికపూడి (MLA Kolikapudi) చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి ఆయన ఎమ్మెల్యే అయిన నాటి నుండి, పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి సొంత పార్టీపై , ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తూ వచ్చారు. వివాదాస్పద నేతగా కొలికపూడి ముద్ర పడిపోయారు. కొంత కాలంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని(శివనాథ్)కు కొలికపుడి కి మధ్య ఆరోపణల యుద్ధం కొనసాగుతోంది..అది మరింత ముదిరి పాకాన పడింది . పార్టీ టికెట్ కోసం కేశినేని చిన్ని తనను ఐదు కోట్లు డిమాండ్ చేశారని., తాను మూడు విడతలుగా చెల్లించానని చెప్పాడు. అంతే కాకుండా తాను ట్రాన్స్ ఫర్ చేసిన వివరాలు కూడా వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.
MLA Kolikapudi Srinivasarao Shocking Comments on MP Chinni
ఇదిలా ఉండగా తాజా వివాదం నేపథ్యంలో కేశినేని, కొలికపూడి ఇద్దరిని రేపు ఉదయం వచ్చి కలవాలని పార్టీ ఏపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు ఆదేశించారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీలో చెప్పు కోవాలని, ఇలా బహిరంగంగా ఆరోపణలు చేసుకుంటే ఎలా అని ప్రశ్నించారు . మొత్తంగా వరుస వివాదాలతో టీడీపీ అతలాకుతలం అవుతోంది. కాగా గతంలో అధినేత చంద్రబాబు అంటే భయం, భక్తి చూపించే వారు సీనియర్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. కానీ ఇప్పుడు ఆ భయం కనిపించడం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.
Also Read : YS Jagan Fired on AP Govt : వ్యవస్థీకృతంగా నకిలీ మద్యం అమ్మకం : జగన్
















