Anirudh Reddy : హైదరాబాద్ – మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి. తనకు షోకాజ్ నోటీసు ఇవ్వడంపై స్పందించారు. తాను ఎవరినీ దురుద్దేశ పూర్వకంగా కామెంట్స్ చేయలేదన్నారు. తాను బనకచర్ల ప్రాజెక్టు గురించి మాత్రమే మాట్లాడానని అన్నారు. గత ప్రభుత్వం కృష్ణా జలాల్లో అన్యాయం చేసిందని, ఇప్పుడు చంద్రబాబు గోదావరి మీద బనకచర్ల కడితే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్ల గురించి మాట్లాడానని చెప్పారు.
MLA Anirudh Reddy Comments
జనంపల్లి అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy) మీడియాతో మాట్లాడారు. తాను అన్న కామెంట్స్ కు పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను ఏ ఉద్దేశంతో అలా మాట్లాడాల్సి వచ్చిందనే విషయంపై పూర్తిగా వివరణ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని అన్నారు. వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. తమ ప్రాంత ప్రయోజనాలకు భంగం కలిగిస్తే ఎలా ఊరుకుంటామని ప్రశ్నించారు. వృధాగా పోయే నీళ్ల గురించి పదే పదే మాట్లాడుతున్నారని , ఇక్కడి నీళ్లు తరలించుకు పోతే ఎలా అని అన్నారు జనంపల్లి అనిరుధ్ రెడ్డి.
ఇదిలా ఉండగా చంద్రబాబు కోవర్టులు తెలంగాణలో ఉన్నారని, వారంతా రోడ్లు, బిల్డింగ్ లు, నీళ్ల ప్రాజెక్టుల్లో తిష్ట వేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు వారందరికీ హైదరాబాద్ లో ఇళ్లకు నీళ్లు, కరెంట్ కనెక్షన్ కట్ చేయాలని అప్పుడే బుద్ది వస్తుందన్నారు ఎమ్మెల్యే. అట్లయితనే బనకచర్ల ప్రాజెక్టు ఆగి పోతుందని లేక పోతే ఆగదని, తెలంగాణ ఎడారి అవుతుందన్నారు.
Also Read : CM Revanth Reddy Interesting Comments : మహిళల, బాలికల భద్రతకు భరోసా


















