Minister Uttam Kumar : ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు రాష్ట్ర భారీ, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar). ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని, ఇస్తే తాము అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఈ విషయాన్ని క్లియర్ గా కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కు స్పష్టం చేశారు. కొంత కాలం నుంచి జల్ శక్తి మంత్రిత్వా శాఖలో తెలంగాణకు చెందిన అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.. కేంద్రమంత్రిగా చొరవ చూపి వాటిని త్వరగా పరిష్కరించాలని కోరామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మొత్తం 90 టీఎంసీల నీటి కేటాయింపు అడిగామన్నారు.. వాటిల్లో 45 టీఎంసీల నీటిని వెంటనే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు కేటాయించాలని కోరామన్నారు మంత్రి.
Minister Uttam Kumar Demands Union Govt
సమావేశంలో కేంద్రమంత్రి శ్రీ సీఆర్ పాటిల్ తో సహా సీడబ్ల్యూసీ ఛైర్మన్ కూడా ఉన్నారు. వారికి కూడా ఇదే విషయాన్ని చెప్పాం అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ అంశం మీ దగ్గరే చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉందని చెప్పాం. పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు మొదటి 45 టీఎంసీల నీటిని వెంటనే కేటాయించాలని ఈరోజు కూడా రెక్వెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా. శశాంక్ గోయెల్, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.
Also Read : Minister Atchannaidu Clear Update on Cotton : పత్తి రైతులను ఆదుకుంటామన్న కేంద్రం
