Minister Uttam Kumar : హైదరాబాద్ – కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవకతవకలు, అక్రమాల పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ను కేబినెట్ ముందుంచారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar) . ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక సారాంశాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్లానింగ్ నుంచి నిర్మాణం, బ్యారేజ్ ల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వరకు జరిగిన అన్నింటికి మాజీ సీఎం కేసీఆర్ బాధ్యుడని పేర్కొన్నారు. కేసీఆర్ తో పాటు ఆనాటి మంత్రి హరీశ్ రావు కూడా భాగం ఉందని ఆరోపించారు.
Minister Uttam Kumar Reddy Shocking Comments
ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ప్రపంచంలోనే అతి పెద్ద భారీ ప్రాజెక్టుగా ఇది చరిత్ర కెక్కింది. కానీ ఎంతగా పేరు పొందిందో ఇదే ప్రాజెక్టు అంతగా ఆరోపణలు, విమర్శలకు గురైంది. 10 సంవత్సరాల పాటు పాలన సాగించిన కేసీఆర్ అనేక రకాలుగా అక్రమాలను ప్రోత్సహించారని ఆరోపించారు ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ఇదిలా ఉండగా ఎవరూ ఊహించని రీతిలో తెలంగాణ రాష్ట్రంలో అనుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పవర్ లోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణకు ఆదేశించారు. అంతేకాకుండా జస్టిస్ ఘోష్ ను కమిషన్ చైర్మన్ గా నియమించింది. విచారణ సందర్బంగా పలువురిని విచారించారు. ఇందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ , హరీశ్ రావు కూడా హాజరయ్యారు.
Also Read : Telugu Film Workers Fired on Mythri Makers : పవన్ కళ్యాణ్ , మైత్రీ మేకర్స్ పై సినీ కార్మికుల ఫైర్
















