Minister Uttam Kumar : హైదరాబాద్ – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar) సీరియస్ కామెంట్స్ చేశారు మాజీ సీఎం కేసీఆర్ పై. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టు గురించి కూలంకుషంగా వివరాలు వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన అక్రమాలు చోటు చేసుకున్నట్లు తేలిందన్నారు. కేబినెట్‌కు సమర్పించిన ఈ సంక్షిప్త నివేదికలో పలువురి నాయకుల పేర్లను ప్రస్తావించారని తెలిపారు. ఇందులో ప్రత్యేకంగా 32 సార్లు కేసీఆర్ , 19 సార్లు హరీశ్ రావు, 5 సార్లు ఈటెల రాజేందర్ పేర్లను ఉటంకించారని స్పష్టం చేశారు. ఆనాడు పాలక వర్గానికి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టవద్దంటూ నిపుణుల కమిటీ సూచించినా పట్టించు కోలేదన్నారు. ఉద్దేశ పూర్వకంగా ఆ నివేదిక ను తొక్కి పెట్టారని ఘోష్ రిపోర్ట్ తేల్చి చెప్పిందన్నారు.
Minister Uttam Kumar Reddy Slams Ex CM KCR
అన్నారం..సుందిల్ల లో పగుళ్లు వచ్చాయని చెప్పారు. లక్ష కోట్ల ప్రాజెక్టు కూలిపోవడం తో విచారణ చేస్తాం అని తాము ముందే చెప్పామన్నారు. విచారణలో భాగంగా ఆనాటి సీఎం కేసీఆర్, మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావులను పిలిపించిందని చెప్పారు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన 650 పేజీల నివేదికను పరిశీలించి, అధికారులు 60 పేజీల సారాంశం రూపొందించారని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవకతవకలు , అక్రమాల పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ను కేబినెట్ ముందు ఉంచామన్నారు. కీలక చర్చలు జరిపినట్లు తెలిపారు. ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక సారాంశాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్లానింగ్ నుంచి నిర్మాణం, బ్యారేజ్ ల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వరకు జరిగిన అవకతవకలు అక్రమాలకు ఆనాటి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యుడని ఘోష్ నివేదిక తేల్చి చెప్పిందన్నారు.
Also Read : CM Revanth Reddy Fired on KCR : కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు తగలేశారు
















