TG Bharat : అమరావతి : ఏపీ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ (TG Bharat) తన ఉదారతను చాటుకున్నారు. కర్నూలులోని డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ అభివృద్ధికి కోటి రూపాయల భారీ విరాళాన్ని అందజేశారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ షావలిఖాన్, ఇతర అధికారులు కర్నూలులో మంత్రి భరత్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారికి రూ.కోటి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు.
Minister TG Bharat Huge Donation
ఈ నిధులను ఓర్వకల్లు సమీపంలో అసంపూర్తిగా ఉన్న యూనివర్సిటీ భవనాల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వినియోగిస్తామని వీసీ ప్రొఫెసర్ షావలిఖాన్ స్పష్టం చేశారు. యూనివర్సిటీకి ఇంత పెద్ద మొత్తంలో విరాళం అందజేసిన మంత్రి భరత్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేశారు. విద్యారంగ అభివృద్ధికి మంత్రి అందిస్తున్న సహకారం అభినందనీయమని కొనియాడారు . మంత్రిని కలిసిన వారిలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ లోకనాథ, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు సూరీ మన్సూర్ అలీఖాన్, డీఎండబ్ల్యూవో సబిహా పర్వీన్ తదితరులు ఉన్నారు. ఈ సందర్బంగా మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తమ ప్రభుత్వం విద్యారంగం అభివృద్దికి ప్రయత్నం చేస్తోందని చెప్పారు. మౌలిక వసతుల కల్పనకు ప్లాన్ చేస్తున్నామని అన్నారు. కర్నూల్ జిల్లాకు రాష్ట్ర హైకోర్టు తలమానికం కాబోతోందన్నారు. అంతే కాకుండా అన్ని రంగాలలో అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి టీజీ భరత్.
Also Read : PM Modi Important Visit to Ayodhya : రామ జన్మభూమిలో ధ్వజారోహణ వేడుక
