Minister Subhash : అమరావతి : ఏపీని వణికిస్తోంది మొంథా తుపాను. కాకినాడ తీరం దాటింది. దీని కారణంగా భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుపాను తాకిడికి అల్లాడుతున్నాయి ఏపీ, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలు. రోడ్లు జలమయం అయ్యాయి. బలమైన ఈదురు గాలుల తాకిడికి చెట్లు కూలి పోయాయి. మరో వైపు ఏపీ సర్కార్ ను అప్రమత్తం చేసింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ. ఇదిలా ఉండగా తాజాగా రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం కోలంక, గొల్లపాలెం గ్రామాల్లో తుఫాన్ ప్రభావంతో భారీ చెట్లు కూలి పోయాయి. విషయం తెలుసుకున్న వెంటనే అక్కడికి చేరుకున్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ (Minister Subhash). సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
Minister Subhash Key Comments
చెట్ల తొలగింపు పనులను పర్యవేక్షించారు మంత్రి. ప్రజల భద్రతను నిర్ధారిస్తూ, అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం పునరావాస కేంద్రాలను సందర్శించారు వాసం శెట్టి సుభాష్. తుఫాన్ ప్రభావిత ప్రజలకు ధైర్యం చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా సర్కార్ ఉందని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే సర్కార్ పెద్ద ఎత్తున అత్యవసర నిధులను కూడా కేటాయించిందని తెలిపారు వాసం శెట్టి సుభాష్. మరో వైపు సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు అప్రమత్తం అయ్యారు. అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.
Also Read : Montha Cyclone Sensational : మొంథా తుపాను ఎఫెక్ట్ సర్కార్ అలర్ట్
















