Minister Sridhar Babu : హైదరాబాద్ : విద్యా వ్యవస్థలో సమూల మార్పు తేవాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) అన్నారు. నేటి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తెలంగాణ యువతను అత్యుత్తమ నైపుణ్యమున్న మానవ వనరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్కిల్లింగ్, రీ- స్కిల్లింగ్, అప్-స్కిల్లింగ్‌పై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. కూకట్ పల్లిలోని జేఎన్టీయూహెచ్ ఆడిటోరియంలో ఈరోజు నిర్వహించిన ‘జేఎన్టీయూహెచ్ గ్లోబల్ అల్యూమ్ని మీట్ – 2025’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Minister Sridhar Babu Key Comments on Development
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తమ ప్రభుత్వం విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యమిస్తోందని స్పష్టం చేశారు. క్వాంటం కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ తదితర కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లో తెలంగాణను అగ్రగామిగా నిలిపేలా ‘ఎకో సిస్టం’ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ‘ఏఐ’లో బెంచ్ మార్క్ సెట్ చేసేలా అంతర్జాతీయ నిపుణుల భాగస్వామ్యంతో త్వరలోనే ‘తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్’ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. మనం జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మరిచిపోవద్దని, సమాజానికి తిరిగి ఇవ్వడం కృతజ్ఞతతో కూడిన బాధ్యత అని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా రంగంపై తమ సర్కార్ ఫోకస్ పెట్టిందని చెప్పారు శ్రీధర్ బాబు.
అంతే కాకుండా కూటమి సర్కార్ ఆధ్వర్యంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి నియోజకవర్గంలో టెక్నో మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందు కోసం రూ. 200 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
Also Read : Garuda Vahanam Interesting : గరుడ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం


















