కోకాపేట శార‌దా పీఠంలో దుద్దిళ్ల‌, త‌న్నీరు

ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న స్వామీ స‌న్నిధిలో

hellotelugu-HarishRao

హైద‌రాబాద్ : కోకాపేట విశాఖ శ్రీ శారదా పీఠంలోని శ్రీ రాజ శ్యామల అమ్మ వారి దేవస్థానంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పీఠం ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండి పోయింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలు భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు, సాంప్రదాయ విలువలను మరింత బలపరిచాయి.

విశాఖ శ్రీ శారదా పీఠం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలు భక్తులకు నూతన సంవత్సరానికి ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందించాయి. భక్తుల భారీ సంఖ్యలో పాల్గొనడంతో ఈ ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి.
ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్ కుమార్ , జస్టిస్ రామకృష్ణ రెడ్డి , ట్నా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి , తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రక్షణ ,వ్యూహాత్మక వ్యవహారాల సలహాదారు, నేషనల్ సెక్యూరిటీ బోర్డ్ మెంబర్, డీఆర్‌డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి , ఎన్‌సీఎల్‌టీ న్యాయ సభ్యుడు జస్టిస్ బద్రీనాథ్ పాల్్గొన్నారు..

మాజీ న్యాయమూర్తి మఠం వెంకటరమణ, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మురళీధర్ రావు , మాజీ మంత్రి హరీష్ రావు , మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ , తెలంగాణ మాజీ డీజీపి అంజన్ కుమార్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ గిడుగు రుద్రరాజు , గజల్ గాయకుడు ఘజల్ శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Exit mobile version