Minister Seethakka : హైదరాబాద్ – మంత్రి సీతక్క బీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్‌కు మొదట్నుంచీ తను అంటే పడదన్నారు. వాళ్లు పార్టీలోకి రమ్మని పిలిచారని, కానీ తాను వెళ్ల లేదన్నారు. తనను ఓడిస్తానంటూ కేటీఆర్ బహిరంగంగానే ప్రకటించడం పట్ల మండిపడ్డారు. ఆయన ఎన్నిసార్లు చెప్పినా తనను ఓడించ లేక పోయాడని మండిపడ్డారు. తాము ఉన్నామని చెప్పుకునేందుకు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. తాను ఎవరి జోలికి వెళ్లనని, కానీ తన జోలికి వస్తే మాత్రం ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు.
Minister Seethakka Slams KTR
సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తనను బద్నాం చేసేందుకు, వ్యక్తిత్వ హననం చేసేందుకు పలుమార్లు ప్రయత్నం చేశారని ఆరోపించారు మంత్రి సీతక్క (Minister Seethakka). ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. గతంలో 10 ఏళ్ల పాటు తెలంగాణ పేరు తో అందినంత మేర దోచుకున్నారని, ఇక ఏం మిగిలి ఉందని ఇప్పుడు తమను లక్ష్యంగా చేసుకున్నారో చెప్పాలన్నారు. ఇప్పటికే మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక నానా తంటాలు పడుతున్నామని వాపోయారు సీతక్క.
ఎవరి హయాంలో ఎంత అభివృద్ది జరిగిందో దమ్ముంటే చర్చకు రావాలన్నారు. తమ నేత గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదంటూ నిప్పులు చెరిగారు. ఎదో నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడినంత మాత్రాన గొప్ప నేతను అనుకుంటే పొరపాటు పడినట్టేనని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా తనను ఎక్కడ నిలబడినా ఓడించి తీరుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీతక్కను ఉద్దేశించి మాజీ మంత్రి కేటీఆర్. దీనిపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీతక్క.
Also Read : Minister Anam Controversial Comments : మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివాదాస్పద కామెంట్స్


















