Minister Seethakka : హైదరాబాద్ – ఆనాడు కేసీఆర్ సర్కార్ బనాయించిన అక్రమ కేసుల కారణంగా తాము కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి సీతక్క (Minister Seethakka). గురువారం మనోరంజన్ కాంప్లెక్స్ ముందు మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఇందిరా పార్క్ వద్ద ఏప్రిల్ 2021లో తాము నిరసన దీక్ష చేపట్టామన్నారు. గత ప్రభుత్వం మాపై అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పేలా చేశారంటూ వాపోయారు. ఇది తమకు ప్రతిబంధకంగా మారిందన్నారు. అయితే తమకు కోర్టుల మీద పూర్తిగా నమ్మకం, విశ్వాసం ఉందన్నారు సీతక్క.
Minister Seethakka Slams KCR
తాము ఎలాంటి తప్పు చేయలేదున్నారు. కాబట్టి నిర్దోషులుగా నిరూపించుకుంటామని స్పష్టం చేశారు. నాతోపాటు, ఎన్ఎస్ఈఐ అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, హైదరాబాద్ ఇండస్ట్రీ అధ్యక్షుడు అభిజిత్ తో పాటు NSUI కార్యకర్తలపై కేసులు నమోదు చేయించారని ఆరోపించారు.
కరోనాతో పేద ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఆనాడు ఆస్తులు అమ్ముకొని లక్షలు ఖర్చుచేసి చికిత్స చేసుకోవాల్సి వస్తోంది అన్న ఆవేదనతో తాము దీక్ష నిర్వహించడం జరిగిందని చెప్పారు.
ప్రజల బాధలు చూడలేక తాము అప్పుడు నిరసన దీక్ష చేపట్టామన్నారు. అయితే మా మీద కక్ష కట్టిన ప్రభుత్వం మేము కరోనాను వ్యాప్తి చేస్తున్నామని తప్పుడు కేసులు నమోదు చేసిందన్నారు. కరోనా కాలంలో ఇంటింటికి తిరిగి ప్రజలకు భరోసా కల్పించి అండగా నిలిచిన చరిత్ర మాదన్నారు. అలాంటి మాపై కరోనాను వ్యాప్తి చేస్తున్నామని KCR కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షలు వెచ్చించలేక కరోనాతో ఎందరో ప్రాణాలు కోల్పోయారని వాపోయారు . అందుకే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి వారి ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశంతో ధర్నా చేపట్టామన్నారు సీతక్క.
ఇదే విషయాన్నితమ తరఫున సీనియర్ న్యాయవాదులు కృష్ణ కుమార్ గౌడ్, ఎస్ఎస్ రావు, నరేందర్ వాదనలు వినిపించారని చెప్పారు. తమ వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఆగస్టు 13 కు వాయిదా వేసిందన్నారు.
Also Read : Minister Satyakumar Yadav Proven : 4.1 కోట్ల మందికి ఎన్సీడీ స్క్రినింగ్ పరీక్ష


















