Minister Savitha : విజయవాడ : రాష్ట్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలల( ఎంజేపీ స్కూళ్లు) అభివృద్ధికి సహకరించాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయ మంత్రి డాక్టర్ రాందాస్ అథవాలేను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత (Minister Savitha) కోరారు. రాష్ట్రంలో డి.ఎన్.టి. కులాల లబ్ధిదారులు వివిధ స్వయం ఉపాధి పథకాల కోసం దరఖాస్తులు చేసుకున్నారని ఈ సందర్బంగా తెలిపారు. వాటికి కూడా పరిష్కారం చూపాలని మంత్రి విన్నవించారు. విజయవాడలోని ఓ హోటల్లో కేంద్ర మంత్రి డాక్టర్ రాందాస్ అథవాలేను మంత్రి సవిత మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీసీలకు సంబంధించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
Minister Savitha Meet Union Minister Ramdas Athawale
రాష్ట్రంలో ఎంజేపీ స్కూళ్ల అభివృద్ధికి రూ.66 కోట్లు మంజూరు చేయాలని కోరారు. స్వయం ఉపాధి కోసం డి.ఎన్.టి కులాల లబ్ధిదారులు 3,700లకు పైగా దరఖాస్తులు చేసుకున్నారని చెప్పారు. వాటికి కూడా పరిష్కారం చూపాలని విన్నవించారు. రాష్ట్రంలో కొలువు తీరిన కూటమి ప్రభుత్వం బహుజనుల సామాజిక వర్గాలకకు చెందిన పిల్లలకు పెద్ద ఎత్తున విద్యావకాశాలను కల్పించడం జరుగుతోందని తెలిపారు. అంతేకాకుండా బీసీ విద్యార్థులు, అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా శిక్షణా సంస్థలను నెలకొల్పడం జరిగిందన్నారు. ఈ రెండింటితో పాటు పలు వినతులను కేంద్ర మంత్రికి అందజేశారు. మంత్రి సవిత వినతులపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రి సవిత వెంట రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్ సత్యనారాయణ, ఇతర బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఉన్నారు.
Also Read : Minister Savitha Interesting Comments on Valmiki Jayanti : ఏపీలో రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి


















