Minister Savitha : అమరావతి : బీసీ హాస్టళ్లు, ఎంజేపీ స్కూళ్లలో చదివే విద్యార్థులను కంటికి రెప్పల్లా, సొంత బిడ్డల్లా చూసుకోవాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. రోజూ కురుస్తున్న వర్షాలు, మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వారానికోసారి సమీపంలో ఉన్న పీహెచ్సీ వైద్యులతో పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. డీబీసీడబ్ల్యూవోలు, ఏబీసీడబ్ల్యూవోలు ప్రతి రోజూ హాస్టళ్లను సందర్శించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్ల వార్డెన్లు, ఎంజేపీ స్కూళ్ల ప్రిన్సిపాళ్లతో మంత్రి సవిత (Minister Savitha) అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. హాస్టళ్లలో పారిశుధ్యంపై తీసుకుంటున్న చర్యలు గురించి అడిగి తెలుసుకున్నారు.
Minister Savitha Key Comments
హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు .విద్యార్థులకు వేడి చల్లార్చిన నీరు, తాజా ఆహారం మాత్రమే ఇవ్వాలని లేకపోతే చర్యలు తప్పవన్నారు. వసతి గృహాల పరిసరాలను, మరుగుదొడ్లు, బాత్ రూమ్ లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని స్పష్టం చేశారు సవిత. హాస్టళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, దోమలు వ్యాప్తి చెందకుండా స్థానిక సంస్థల సాయంతో ఫాగింగ్ చేయించాలని సవిత ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొన్న సంక్షేమ హాస్టళ్లలో దురదృష్టకర సంఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వార్డెన్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు. విద్యార్థులను కన్న బిడ్డల్లా, కంటికి రెప్పలా కాపాడు కోవాలన్నారు.
Also Read : Minister Atchannaidu Important Update : రైతు ప్రయోజనాలే కూటమి ప్రభుత్వానికి ప్రాధాన్యం


















