Minister Savitha : అమరావతి : కల్తీ మద్యం పాపాత్ముడు జగనే అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత (Minister Savitha) సంచలన ఆరోపణలు చేశారు. అయిదేళ్ల జగన్ పాలనలో కల్తీ మద్యం ఏరులై పారిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్ట మంటగలిపేలా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా కల్తీ మద్యం తయారీ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు గురువారం సవిత మీడియాతో మాట్లాడారు. జగన్ పాలనలో జే బ్రాండ్ పేరుతో కల్తీ మద్యానికి తెర తీశారని , దీని ద్వారానే భారీ ఎత్తున అమ్మకాలు చేపట్టారని మండిపడ్డారు. 5 ఏళ్లలో కల్తీ మద్యం తాగి 30 వేల మంది ప్రాణాలు కోల్పోగా, 30 లక్షల మంది అమాయకులు అనారోగ్యం పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. జంగారెడ్డి గూడెంలో కల్తీ నాటుసారా తాగి 27 మంది ప్రాణాలు కోల్పోతే కనీసం పోస్టు మార్టమైనా చేయకుండా, విచారణ జరపకుండా కేసు తప్పుదారి పట్టించారన్నారు.
Minister Savitha Slams YS Jagan
గతంలో విజయవాడలోని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బార్ లో కల్తీ మద్యం తాగి ఆరుగురు మృతి చెందడం వాస్తవం కాదా..? అని నిలదీశారు. 2014 ఎన్నికల సమయంలో సర్వేపల్లి, కావలి నియోజక వర్గాల వైసీపీ అభ్యర్థులు కాకాణి గోవర్దన్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పంపిణీ చేసిన కల్తీ మద్యం తాగి ఎందరో అమాయకులు మరణించడం నిజం కాదా..? అని ప్రశ్నించారు. జగన్ అయిదేళ్ల పాలనలో బ్రాండెడ్ మద్యం అమ్మకాలను నిలిపేసి, జే బ్రాండ్ పేరుతో కల్తీ మద్యాన్ని అధిక ధరలకు విక్రయించి, పేదల రక్తమాంసాలు పీల్చిపిప్చి చేసి రూ.3,500 కోట్లు దోచుకున్నారన్నారు. దోచుకున్న డబ్బుతో ఆఫ్రికా దేశాల్లో కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారన్నారు. ఇదే విషయం కామెరూన్ లో అక్కడి మంత్రి చెప్పడం వాస్తవం కాదా, రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ ను సీజ్ చేయడం నిజం కాదా..? అని ప్రశ్నించారు.
Also Read : KS Viswanathan Interesting Update : అర్హులందరికీ అక్రిడేషన్లు ఇస్తాం


















