Minister Savitha : అమరావతి – రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ది కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు మంత్రి ఎస్. సవిత. ఇప్పటికే బడ్జెట్ లో అత్యధికంగా నిధులు కేటాయించామన్నారు. ఆదరణ 3.0 పథకం అమలులో కూడా మత్స్యకారులకు ప్రాధాన్యం ఇస్తామని, ఆధునిక పరికరాలు అందజేస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని తాము వచ్చాక పెంచడం జరిగిందన్నారు. రాష్ట్రంలో మత్స్యకారులను అన్ని విధాలా అభివృద్ధే చేయడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని స్పష్టం చేశారు. మత్స్యకారులకు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని అన్నారు. మంత్రి సవితను (Minister Savitha) తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు మర్యాద పూర్వకంగా కలిశారు. చైర్మన్ గా అవకాశం ఇచ్చినందుకు సీఎం చంద్రబాబుకు, మంత్రి సవితకు ధన్యవాదాలు తెలిపారు.
Minister Savitha Key Comments
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ మత్స్యకారులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు తప్పకుండా నెరవేర్చుతున్నారని చెప్పారు. ఇప్పటికే వేట విరామ సమయంలో ఇచ్చే ఆర్థిక సాయాన్ని రెట్టింపు చేశామని, రూ.20 వేలకు పెంచి అందజేశామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మత్స్యకారులకు రూ.10 వేల చొప్పున మాత్రమే అందజేశారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.29 లక్షలకు పైగా మత్స్యకారులకు రూ.259 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 217 ను రద్దు చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానిదేనన్నారు. చేపల వేట నిషేధకాలంలో మత్స్యకారులకు భృతి ఇవ్వాలని నిర్ణయించిన ఘనత కూడా సీఎం చంద్రబాబు నాయుడిదేనన్నారు. మత్స్యకారులకు 50 ఏళ్లకే ఫించన్లు అందజేసిన ఘనత కూడా టీడీపీదేనన్నారు.
Also Read : Chinta Mohan – Popular Leader : రాజీవ్ గాంధీ అరుదైన నాయకుడు
















