Minister Savitha : పెనుకొండ/శ్రీ సత్యసాయి జిల్లా : సీఎం చంద్రబాబు నాయుడి నేతృత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని, ఆయన పాలనే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత (Minister Savitha) తెలిపారు. తెలుగోడి తలరాత మారిందన్నారు. సోమందేపల్లి మండలం బ్రాహ్మణపల్లిలో ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబు 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సంబరాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి, చంద్రబాబు (CM Chandrababu) చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ 1995 సెప్టెంబర్ ఒకటో తేదీన ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబు నాయుడు తొలిసారిగా బాధ్యతలు చేపట్టారన్నారు. 45 ఏళ్ల వయస్సులోనే సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన అభివృద్ది పథంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని నడిపించారన్నారు.
Minister Savitha Interesting Comments on AP Growth
బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. మహిళల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేశారన్నారు. డ్వాక్రా సంఘాలను ప్రారంభించి, మహిళలను ఆర్థికంగా అభివృద్ది పరిచారన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పించారన్నారు. వృద్ధ, వితంతు, దివ్యాంగుల పెన్షన్లతో పాటు ఒంటరి మహిళ పెన్షన్లు అంద జేస్తున్నారన్నారు. రైతులకు అండగా నిలుస్తున్నారన్నారు. యువతకు ఉద్యోగాలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారన్నారు.
డీఎస్సీ ద్వారా లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ఘనత కూడా సీఎం చంద్రబాబు దేనన్నారు. పారిశ్రామిక రంగంతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని భావించిన ఆయన, కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే రూ.10.50 లక్షల కోట్లు పెట్టుబడులను ఏపీకి తీసుకొచ్చారని చెప్పారు మంత్రి ఎస్. సవిత.. కియా లాంటి అంతర్జాతీయ పరిశ్రమలను రాష్ట్రంలో ఏర్పాటు చేశారన్నారు. రాయలసీమను రతనాల సీమగా, సస్య శ్యామలంగా తీర్చిదిద్దుతూ, సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తున్నారన్నారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా కుప్పంలోని చివరి ఎకరాకు సాగు నీరందించిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు.
Also Read : YS Sharmila Fired on CM Chandrababu : అన్నమయ్య ప్రాజెక్టుపై వివక్ష తగదు

















