Minister Savitha : కొవ్వూరు/తూర్పు గోదావరి జిల్లా : తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర బీసీ సంక్షేమ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత (Minister Savitha) ఆదివారం కొవ్వూరు నియోజకవర్గంలో శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తో కలిసి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు.
పర్యటన నేపథ్యంలోచాగల్లు, తాళ్లపూడి మండలాలకు చెందిన పది మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.4,50,500 విలువైన చెక్కులను అందజేశారు. అనంతరం మంత్రి సవిత (Minister Savitha) వాడపల్లి గ్రామంలోని బీసీ బాలుర వసతి గృహం, మహాత్మా జ్యోతిరావు పూలే (ఎమ్.జె.పి.) గురుకుల పాఠశాలను ఆకస్మికంగా పరిశీలించారు.
Minister Savitha Key Update
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. విద్య, ఉపాధి, ఆరోగ్యం వంటి రంగాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ఎమ్.జె.పి. గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తామని ప్రకటంచారు ఎస్. సవిత. వాడపల్లి మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, భోజన నాణ్యతను పరిశీలించారు.
మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలవుతోందా? మెనూ ప్రకారం ఆహారం అందుతున్నదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం కావడంతో గురుకుల పాఠశాల వద్దకు వొచ్చిన విద్యార్థుల తల్లులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగింది . ప్రభుత్వం ఐ వి ఆర్ ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని, మరింత మెరుగ్గా పౌర సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
Also Read : PM Modi Tour – Huge Security : ప్రధాని మోదీ టూర్ పై భారీ బందోబస్తు
















