Minister Savitha : అమరావతి : మహోన్నత మానవుడు మహాత్మా జ్యోతిబా పూలే అని కొనియాడారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత (Minister Savitha). బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహ్మాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశం గర్వించదగ్గ సంఘ సంస్కర్తల్లో మహాత్మా జ్యోతిరావు పూలే ముందు వరుసలో ఉంటారని అన్నారు. అణగారిన వర్గాలు, స్త్రీల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహానుభావుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన జ్యోతిరావు పూలే అంటరాని తనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు చివరి వరకూ రాజీలేని పోరాటం చేసిన మహనీయుడని పేర్కొన్నారు ఎస్. సవిత. బాలికలకు తొలి పాఠశాల స్థాపించిన విద్యావేత్త జ్యోతిరావు పూలే అన్నారు.
Minister Savitha Key Comments on Jyotiba Phule
ఈ పాఠశాలలో అన్ని కులాలకూ ప్రవేశం కల్పించిన గొప్ప సంఘ సంస్కర్త అని ప్రశంసించారు .వితంతు పునర్వివాహాల గురించి ఫూలే ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చాడని చెప్పారు. అంతే కాదు స్వయంగా వితంతువులకు వివాహాలు జరిపించాడని అన్నారు. స్త్రీ, పురుషుల మధ్య లింగవివక్షను ఫూలే విమర్శించాడని , సమానత్వం, స్వేచ్ఛ, ఐకమత్యంతో కూడిన సమ సమాజాన్ని కాంక్షించాడని కొనియాడారు. బాల హత్య ప్రతిబంధక్ గృహం స్థాపించి.. వితంతువులైన గర్భిణీ స్త్రీలకు అండగా నిలిచిన గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు ఎస్. సవిత. వితంతు మహిళల, అనాథ శిశువుల కోసం సేవా సదనం ప్రారంభించాడని చెప్పారు. జ్యోతిరావు పూలే స్ఫూర్తితో అన్న ఎన్టీఆర్ బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలని టీడీపీ స్థాపించారని తెలిపారు. ఏపీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బడ్జెట్ లో బీసీలకు అత్యధిక నిధులు 48,750 వేల కోట్లు కేటాయించామన్నారు.
Also Read : KTR Fired on CM Revanth Reddy : పాలమూరుకు రేవంత్ రెడ్డి చేసింది శూన్యం
















