Minister Savitha : అమరావతి : జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న అన్నపర్రు బీసీ హాస్టల్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారి ఆరోగ్యం పూర్తిగా మెరుగయ్యేకే డిశ్చార్జి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత (Minister Savitha) ఆదేశించారు. అన్నపర్రు బీసీ హాస్టల్ విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులపై బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున, జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్.వి.వి.రమణతో మంత్రి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్.వి.వి.రమణను అడిగి తెలుసుకున్నారు. 60 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఆసుపత్రికి చేరగా, ప్రస్తుతం 24 మంది మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఒక విద్యార్థి ఐసీయూలో చికిత్స అందజేస్తున్నామని తెలిపారు.
Minister Savitha Key Comments
ఆ విద్యార్థి ఇంతకు ముందు నుంచే కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతుండడంతో ఐసీయూలో వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. మరో ఇద్దరు విద్యార్థులు పెదనందిపాడు కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. మిగిలిన విద్యార్థులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశామన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత స్పందిస్తూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఆ విద్యార్థుల ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన తరవాతే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యంపై గంటకు గంటకూ అప్ డేట్ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న విద్యార్థిని తక్షణమే ఎయిమ్స్ కు తరలించాలని మంత్రి సవిత ఆదేశించారు.
Also Read : Minister Atchannaidu Interesting Comments : రైతు సంక్షేమం దేశాభివృద్దికి సోపానం


















