Minister Savitha : అమరావతి : సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా భక్త కనకదాస జయంతిని వచ్చే నవంబర్ నెల 8వ తేదీన రాష్ట్ర జయంతిగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత (Minister Savitha) ప్రకటించారు. రాష్ట్ర జయంతిని అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో నిర్వహించనున్నామని, ఈ ఉత్సవానికి మంత్రి నారా లోకేశ్ హాజరు కానున్నారని వెల్లడించారు. ఈ మేరకు గురువారం మంత్రి సవిత మీడియాతో మాట్లాడారు. సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా భక్త కనకదాస తన కీర్తనలు, రచనలతో సమాజంలో అసమానతల పైనా, కుల వ్యవస్థ పైనా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని పేర్కొన్నారు. సామాజిక రుగ్మతల నిర్మూలనకు కనకదాస చేసిన సేవలు శ్లాఘనీయమన్నారు.
Minister Savitha Comments
అటువంటి మహానీయుని జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు ఎస్. సవిత. గతేడాది అనంతపురంలో భక్త కనకదాస రాష్ట్ర స్థాయి జయింతిని నిర్వహించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ ఏడాది అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో రాష్ట్ర స్థాయి భక్త కనకదాస జయంతిని నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రెండ్రోజుల్లో కూటమి ప్రభుత్వం విడుదల చేయనుందని తెలిపారు. వచ్చే నెల ఎనిమిదో తేదీన అన్ని జిల్లాల్లోనూ భక్త కనకదాస జయంతి నిర్వహించేలా ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొననున్నట్లు చెప్పారు ఎస్. సవిత. ఈసారి కల్యాణదుర్గంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి భక్త కనకదాస జయంత్యోత్సవంలో మంత్రితో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారని తెలిపారు.
Also Read : Amit Shah Shocking Comments on India Alliance : బీహార్ లో ఇండియా కూటమి ఓటమి ఖాయం



















