Minister Ramanaidu : మంత్రి నిమ్మల రామా నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇందులో భాగంగా పోలవరంకు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చారు. మంగళవారం నిమ్మల రామా నాయుడు (Minister Ramanaidu) మీడియాతో మాట్లాడారు. పోలవరం డయాఫ్రం వాల్ మొత్తం పొడవు 1396 మీటర్లకు గానూ, నేటికి 500 మీటర్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. మూడు ట్రెంచ్ కట్టర్లు, మూడు గ్రాబర్లతో శరవేగంగా డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు నిమ్మల రామానాయుడు.
Minister Ramanaidu Key Comments on Polavaram
2025 డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి. వరదల సమయంలో సైతం డివాటరింగ్ చేస్తూ డయా ఫ్రం వాల్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. గతంలో జగన్ రెడ్డి సర్కార్ పోలవరం ప్రాజెక్టు పనులను పట్టించు కోలేదన్నారు. దీంతో తాము వచ్చాక వాటిపై ఫోకస్ పెట్టామన్నారు నిమ్మల రామానాయుడు. గత ప్రభుత్వం ముంచేసిన పోలవరం ప్రాజెక్టు పనులను గాడిలో పెట్టడం జరిగిందని స్పష్టం చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన షెడ్యూల్ కు అనుగుణంగా పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
వరదల సమయంలో సైతం పనులకు ఆటంకం కాకుండా, ఎగువ కాఫర్ డ్యాంను బలోపేతం చేసేలా బట్రస్ డ్యాం నిర్మాణం చేపట్టామన్నారు. ఇప్పటికే 90 శాతంకు పైగా పనులు పూర్తయినట్లు చెప్పారు నిమ్మల రామా నాయుడు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చేలా చేస్తామన్నారు.
Also Read : Justice Varma Case Shocking : జస్టిస్ వర్మపై దర్యాప్తు ప్యానల్ ఏర్పాటు















