Minister Ram Prasad : అమరావతి – పర్యటనలు, పరామర్శల పేరుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి (Minister Ram Prasad ). మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడని, తనను జనం నమ్మే పరిస్థితిలో లేరన్నారు. తన వ్యక్తిగత ప్రచారం కోసం ఈ టూర్స్ తప్పా తను చేసింది ఏమీ లేదన్నారు. బంగారు పాళ్యంలో జగన్ నిర్వహిస్తున్న పర్యటన బక్వాస్ అంటూ పేర్కొన్నారు. అందుకే తన పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో జగన్ రెడ్డికి షాకిచ్చారని, కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని ఆరోపించారు.
Minister Ram Prasad Slams YS Jagan
ఓటమిని జీర్ణించు కోలేక అనవసరంగా ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ఆయన ఇలా రోడ్ల పైకి దిగడం దురదృష్టకరమన్నారని అన్నారు. ఇది ప్రజల తీర్పును ధిక్కరించే చర్య అని పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలు జగన్‌కి స్పష్టమైన తీర్పు చెప్పినా బుద్ది రాలేదన్నారు. జగన్ పర్యటన ప్రజా సమస్యల కోసం కాదని, ఇది స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పథకం ప్రకారం చేసిన పర్యటన మాత్రమేనని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఎస్పీ, జిల్లా అధికారులు హెచ్చరికలు చేసినప్పటికీ జగన్, ఆయన అనుచరులు చట్టాన్ని పక్కనపెట్టి వ్యవహరించడం సమంజసం కాదన్నారు.
Also Read : Minister Ramanaidu Interesting : ప్రాజెక్టుల మరమ్మతుల కోసం రూ. 350 కోట్లు















