Minister Ponnam : హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వరుసగా బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న చేవెళ్ల, ఇవాళ మరో రెండు చోట్ల ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీనిని సీరియస్ గా తీసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ (Minister Ponnam). ఆయన రవాణా శాఖ అధికారులతో కీలక జూమ్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్నారు స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్,రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి , జేటీసి లు , డీటీసీలు ,ఇతర రవాణా శాఖ అధికారులు. వరుస ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇక నుంచి ప్రమాదాల నివారణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. లేకపోతే చర్యలు తప్పవన్నారు. జరిగిన ప్రమాదంలో రెండు వాహనాలకు ఫిట్నెస్ ఉన్నప్పటికీ ఇరుకు రోడ్డు డివైడర్ లేకపోవడం వల్ల ప్రమాదం జరిగింద్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందన్నారు మంత్రి.
Minister Ponnam Prabhakar Key Instructions
వాహనాల స్పీడ్ లాక్ ఎంత వరకు అమలవుతున్నాయో చూడాలని స్పష్టం చేశారు పొన్నం ప్రభాకర్ గౌడ్ (Minister Ponnam). ఒకవేళ వాహనదారులు బ్రేక్ చేస్తే తప్పనిసరిగా పెనాల్టీ వేయాలని సూచించారు. రవాణా శాఖ అధికారులు , ఎన్ఫోర్స్మెంట్ సీరియస్ గా యాక్టివ్ గా ఉండాలన్నారు. ఘటన జరిగినప్పుడు దాడులే కాదు నిరంతరం యాక్షన్ ప్లాన్ ఉండేలా కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. రవాణా శాఖ గౌరవాన్ని ప్రజల్లో , ప్రభుత్వంలో పెంపొందించేలా ఉద్యోగులు పని చేయాలని కోరారు. అందరూ ఎఫెక్టివ్ గా పని చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు పొన్నం ప్రభాకర్ గౌడ్.
రవాణా శాఖ అధికారులు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రతి జిల్లాలో కఠినంగా వ్యవహరిస్తేనే రోడ్డు ప్రమాదాలను కంట్రోల్ చేయవచ్చన్నారు. వేధింపులు లేకుండా రవాణా శాఖ నిబంధనల ప్రకారం వ్యవహరించాలని సూచించారు. రవాణా శాఖ లో కొత్తగా వచ్చిన ఉద్యోగలు, సీనియర్లు సమన్వయం చేసుకుంటూ పని చేయాలన్నారు. డీటీసీ ,ఆర్టీవో లు ఇతర రవాణా శాఖ అధికారులు ఒక్కో జిల్లాలో మూడు బృందాలుగా ఏర్పాటు చేసుకొని నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.
Also Read : Hinduja Group Huge Investment : ఏపీలో హిందూజా గ్రూప్ రూ. 20 వేల కోట్లు ఇన్వెస్ట్


















