Minister Ponnam : హైదరాబాద్ – తాము పదవులకు ఎందుకు రాజీనామా చేయాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ (Minister Ponnam). తమపై నిందలు మోపే ముందు ఒక్కసారి ఆలోచించుకుంటే బెటర్ అన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో నువ్వు రాజీనామా చేయకుండా తప్పించుకున్నది మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. ఎవరు పదవులను అంటి పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. శనివారం పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు.
Minister Ponnam Prabhakar Slams Union Minister Kishan Reddy
కేవలం 6 శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి 13 మంత్రి పదవులు ఇచ్చారని, 56 శాతం ఉన్న బీసీలకు కేవలం మూడు పదవులే దక్కాయని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు , కిషన్ రెడ్డిలు ఆరోపణలు చేయడం పట్ల తీవ్రంగా ఖండించారు. ముందు మీ సంగతి చూసుకుంటే బెటర్ అన్నారు. కిషన్ రెడ్డి రాజీనామా చేసి ఆ తర్వాత మమ్మల్ని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు.
కిషన్ రెడ్డి తన పదవిని త్యాగం చేసి ధర్మపురి అరవింద్, లక్ష్మణ్, ఈటల, కృష్ణయ్య వంటి బీసీలకు ఇవ్వాలన్నారు. అప్పుడే నీకు మాట్లాడేందుకు అర్హత ఉంటుందన్నారు. బలహీన వర్గానికి చెందిన బండి సంజయ్ ని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించి బలహీన వర్గాల వ్యతిరేకి అయిన రామచంద్రరావుకు ఇచ్చింది మీ పార్టీ కాదా అని ప్రశ్నించారు పొన్నం ప్రభాకర్ గౌడ్. బలహీన వర్గాలకు సీఎం అని ప్రకటించిన బీజేపీ కనీసం శాసనసభ నాయకత్వం కూడా ఇవ్వలేక పోయిందంటూ మండిపడ్డారు.
Also Read : Vedma Bojju Sensational Comments : జీవో 49 తెస్తే రాజీనామా చేస్తా – ఎమ్మెల్యే
