Minister Ponnam : హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈనెల 11న మంగళవారం పోలింగ్ జరగనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. ముగ్గురు సీనియర్ అధికారులను నియమించింది పర్యవేక్షకులుగా. ఇక జోరుగా సాగించిన ప్రచారానికి తెర పడింది. ఇక్కడ మొత్తం 81 మంది బరిలో నిలిచారు. కానీ ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్యే త్రిముఖ పోటీ నెలకొంది. కానీ రాను రాను కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారి పోయింది. హస్తం నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
Minister Ponnam Prabhakar Comments
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస సెంటిమెంట్ ను ప్రయోగిస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజా పాలనను ప్రస్తావిస్తోంది. చివరగా ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam). ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం ఖాయమని జోష్యం చెప్పారు. తాము అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని అన్నారు. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదన్నారు. ఆరు నూరైనా సరే నవీన్ యాదవ్ గెలవడం ఖాయమని అన్నారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. ప్రజలు ఆ పార్టీని నమ్మడం లేదని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేశామన్నారు.
Also Read : Naveen Yadav Sensational Comments : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేది నేనే
















