Minister Nimmala : అమరావతి : రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరలోనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala). అమరావతి లని సచివాలయంలో ఆయన సమీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి నీటి పారుదల శాఖ కు చెందిన ఇరిగేషన్ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహామూర్తి, గోదావరి డెల్టా సిఈ, ఈఈలతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు మంత్రి. ప్రధానంగా కోనసీమ అంబేద్కర్ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని శంకరగుప్తం డ్రైన్ సమప్యపై ప్రస్తావించారు. సాధ్యమైనంత వరకు దీనిపై ఫోకస్ పెట్టాలని, త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని నిమ్మల రామానాయుడు ఆదేశించారు.
Minister Nimmala Rama Naidu Comments
ఇదిలా ఉండగా గతంలో శంకరగుప్తం డ్రైన్ ను తాను పరిశీలించానని మరోసారి గుర్తు చేశారు నిమ్మల రామానాయుడు. స్దానిక కొబ్బరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకుని, సమస్య పరిష్కారానికి ఉన్నత స్దాయి నిపుణుల కమిణీని పంపిస్తానని హామీ ఇచ్చారు. శంకరగుప్తం డ్రైన్ స్దితిగతులు, ముంపునకు గల కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాల మేరకు పరిశీలించింది నిపుణుల బృందం . సముద్రపు అలలతో ముంపునకు గురవుతున్న కేశవదాసు పాలెం, శంకరగుప్తం, పడమటిపాలెం, కేశనపల్లి, తూర్పుపాలెం, గొల్లపాలెం, కరవాక గ్రామాలను పరిశీలించి పూర్తి నివేదికను మంత్రి నిమ్మల రామానాయుడుకు అందజేశారు.
Also Read : Minister Kandula Durgesh Important Update : వందేమాతరం గీతం కాదు జాతి ఆత్మ గౌరవం

















