Minister Nimmala : అమరావతి : ఏపీ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు కీలక ప్రకటన చేశారు. కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న కావేరి ట్రావెల్స్ వోల్వో బస్సు దగ్ధం ఘటనపై స్పందించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఉన్నతాధికారులతో, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరితో మాట్లాడానని చెప్పారు. అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించామన్నారు. ఈ మేరకు కలెక్టర్ దగ్గురండి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు, బాధితులకు అవసరమైన సహాయ, సహకారం అందిస్తున్నారని స్పష్టం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala). మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నారని చెప్పారు.
Minister Nimmala Rama Naidu Key Comments
మృతుల కుటుంబాలను ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుందన్నారు. ఈ ఘటన గురించి దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు వాకబు చేశారన్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రులను ఆదేశించారని తెలిపారు. ఇదిలా ఉండగా ప్రాథమిక సమాచారం మేరకు మొత్తం 41 మంది ప్రయాణిస్తున్నారని, వీరిలో 21 మంది సురక్షితంగా బయట పడ్డారని తెలిపారు. మరో 20 మంది ప్రాణాలు కోల్పోయారని, వీరిలో 11 మందిని గుర్తించడం జరిగిందన్నారు నిమ్మల రామా నాయుడు.
Also Read : Kurnool Bus Incident Important Update : బస్సు ఘటనకు సంబంధించి కంట్రోల్ రూమ్స్
















