Minister Nimmala : అమరావతి – పోలవరంకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala). పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతి పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీక్షలో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ జి. సాయి ప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఆయా ప్రాజెక్టుల ఎస్‌ఈలు, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు, ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. డయాఫ్రమ్ వాల్ 25,238 చదరపు మీటర్లు పూర్తి చేయడం జరిగిందని, ఇప్పటి వరకు 40 శాతం పురోగతి సాధించిందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.
Minister Nimmala Rama Naidu Key Comments
డయాఫ్రమ్ వాల్ 373 ప్యానల్స్ గాను, ఇప్పటికే క్రిటికల్ గా ఉన్న 130 ప్యానల్స్ పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. వరద కాలంలో కూడా డయాఫ్రమ్ వాల్ పనులు ఆగకుండా, డివాటరింగ్ చేసుకుంటూ 2025 డిసెంబర్ కు పూర్తి చేస్తామని ప్రకటించారు. గ్యాప్-1 ఎర్త్ కమ్ రాక్ ఫీల్ డ్యామ్ పనులు 2026 మార్చి నాటికి పూర్తి చేసే లక్ష్యంగా జరుగుతున్నాయని తెలిపారు. గ్యాప్-2 ఈసిఆర్ఎఫ్ డ్యామ్ డిజైన్స్ సిడబ్ల్యూసి, పిపిఏ ఆమోదం పొందిన వెంటనే నవంబర్ కు పనులు మొదలు పెడతామన్నారు.
పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తిచేసి 2025 కల్లా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తీసుకు వెళ్లేలా సీఎం నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా నిరర్దేశించారని, ఆ మేరకు అందుకు అనుగుణంగా పూర్తి చేస్తామన్నారు. పోలవరం ఎడమ కాలువ పనుల పురోగతికి సంబంధించి నేషనల్ హైవే క్రాసింగ్ బ్రిడ్జ్ ల పనులు ఆగస్టు లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గత ఐదు సంవత్సరాల పాలనలో పోలవరం ఎడమ కాలువకు ఒక్క రూపాయి గాని, ఒక తట్ట మట్టి పనులు గానీ చేయలేదంటూ ఆరోపించారు నిమ్మల రామానాయుడు.
Also Read : Stock Market Growth : స్వల్ప లాభాల్లో నడుస్తున్న సూచీలు
















