Minister Nimmala : అమరావతి : దేశం గర్వించ దగిన మహోన్నత మానవుడు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని ప్రశంసలు కురిపించారు ఏపీ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు (Minister Nimmala). ప్రతి ఏటా సెప్టెంబర్ 15న ఇంజనీర్స్ డే నిర్వహిస్తూ వస్తారు. ఈ దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప ఇంజనీర్, భావితరాలకు స్పూర్తి సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య . ఆయన పుట్టిన రోజు ఇవాళ. ఆయన జయంతి సందర్బంగా ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్బంగా మంత్రి నిమ్మల.
Minister Nimmala Rama Naidu Key Comments on Mokshagundam
మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ నిర్మాణంలో భాగస్వామ్యమైన ఇంజనీర్లందరికీ ఇంజనీరింగ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రామానాయుడు. దేశాభివృద్ది ఇంజనీర్ల చేతిలోనే ఉంటుంది అని చెప్పిన గొప్ప సివిల్ ఇంజనీర్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని పేర్కొన్నారు. భారత దేశంలో ఆధునిక ఇంజనీరింగ్ విద్యకు, యువ ఇంజనీర్లకు ఆయనే దిక్చూచి అని స్పష్టం చేశారు. దేశ భవిష్యత్తు జలాశయాలే అని నమ్మి వాటిని నిర్మించిన మహోన్నతుడు తను అని తెలిపారు.
ప్రపంచంలోనే మొదటి సారిగా ఇరిగేషన్ రంగంలో భారీ ప్రాజెక్టులలో గేట్లను ఏ స్దాయిలో పెట్టాలి, ఫ్లడ్ మేనేజ్ మెంట్ ఎలా చేయాలి అని ఆటోమేటిక్ గా గేట్లు రూపొందించి ప్రపంచానికి తన సత్తా చాటారని వెల్లడించారు నిమ్మల రామానాయుడు. ఇవాళ రాష్ట్రంలో వేసవిలో సైతం రిజర్వాయర్లు అన్ని జల కళ తో కళకళ లాడాయంటే విశ్వేశ్వరయ్య స్ఫూర్తి తో చంద్రబాబు పని చెయ్యడమేనని పేర్కొన్నారు.
Also Read : RSS Chief Important Comments : భారతీయ సంస్కృతి ప్రత్యేకమైనది : ఆర్ఎస్ఎస్ చీఫ్


















