Minister Narayana : అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన 52వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్బంగా కీలక అంశాలపై చర్చించారు. ఏజీసీలో మౌళిక వసతుల కల్పన కు టెండర్లు దక్కించుకున్న సంస్థకు ఎల్ఏఓ ఇచ్చేందుకు ఆమోదం తెలిపిందన్నారు రాష్ట్ర పట్టణ, పురపాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయణ (Minister Narayana). సీఆర్డీఏ ఆధ్వర్యంలో ఏడీసీఎల్ తరహాలో కొత్తగా మరో ఎస్పీవీ ఏర్పాటుకు అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు. ఎయిర్ పోర్ట్, స్పోర్ట్స్ సిటీ,ఎన్టీఆర్ విగ్రహం వంటి కీలక ప్రాజెక్టుల నిర్మాణం కోసం కూడా ఓకే చెప్పిందని అన్నారు నారాయణ. అర్బన్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చరల్ గైడెన్స్ కోసం నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా సీఆర్డీఏ ఆమోదించిందన్నారు.
Minister Narayana Comments
రెవెన్యూ, సర్వే సెటిల్మెంట్ శాఖల నుంచి 138 మంది ఉద్యోగులను డిప్యూటీషన్ పై తీసుకునేందుకు ఓకే చెప్పిందన్నారు నారాయణ. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇవ్వని అతి కొద్దిమంది రైతుల భూములను భూసేకరణ ద్వారా తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. రైతులను ఇబ్బంది పెట్ట కూడదనేది ప్రభుత్వ నిర్ణయం అన్నారు. ఇప్పటికీ ల్యాండ్ పూలింగ్ కు రైతులు ముందుకొస్తే తీసుకుంటామని స్పష్టం చేశారు మంత్రి. దాదాపు 1800 ఎకరాలు భూసేకరణ ద్వారా తీసుకునేందుకు CRDAకు పర్మిషన్ ఇవడం జరిగిందన్నారు. ల్యాండ్ పూలింగ్ కు రావాలని మరోసారి రైతులను రిక్వెస్ట్ చేస్తున్నామన్నారు.
Also Read : YS Jagan Fired on CM Chandrababu : చంద్రబాబు పాలనలో రైతులు ఆగమాగం
















