Minister Narayana : అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం యుద్ద ప్రాతిపదికన చేపడుతున్నామని స్పష్టం చేశారు రాష్ట్ర మున్సిపల్ , పట్టణాభివృద్ది, గృహ నిర్మాణ శాఖ మంత్రి నారాయణ (Minister Narayana). గురువారం శాసన సభ్యులు ఇళ్ల నిర్మాణం గురించి లేవదీసిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. 2014-19 లో కేంద్ర ప్రభుత్వం 7,01,481 టిడ్కో ఇళ్లను ఏపీకి కేటాయించిందని చెప్పారు. వీటిలో 5,14,000 ఇళ్ల నిర్మాణానికి పాలనా అనుమతులు తీసుకుని టెండర్లు పిలిచామని వెల్లడించారు. గత వైసీపీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వీటిని 2,61,640 కు తగ్గించిందని, కనీసం కుదించిన ఇళ్లను కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు నారాయణ.
Minister Narayana Comments
రాష్ట్రంలో 51 ప్రాంతాల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయని చెప్పారు. మరో 112 చోట్ల ఇంకా పూర్తి చేయాల్సి ఉందన్నారు మంత్రి. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు, ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేందుకు కనీస మొత్తం రూ. 6139 కోట్లు కావాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగా సీఎం నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు వివిధ బ్యాంకులతో సంప్రదింపులు జరపడం జరిగిందని చెప్పారు. ఇదిలా ఉండగా రూ. 4,500 కోట్ల రుణం ఇచ్చేందుకు హడ్కో ముందుకు వచ్చిందని వెల్లడించారు. ఈ మేరకు అంగీకారం తెలపడంతో ప్రభుత్వం ఒప్పందం చేసుకునేందుకు సిద్దంగా ఉందన్నారు. ఆదిశగా టిడ్కో ఇళ్లను మరింత వేగవంతం చేపట్టేలా చేస్తామన్నారు మంత్రి నారాయణ.
Also Read : Minister Gottipati Important Update : సోలార్ విద్యుత్ సామర్థ్యం 78.50 గిగావాట్లకు పెంచుతాం

















