Nara Lokesh : ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియా – ఇండియా సీఈవో ఫోరం డైరెక్టర్ మెక్‌కే తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సిడ్నీలో సమావేశమయ్యారు. ఆయన ఆస్ట్రేలియా సర్కార్ ఆహ్వానం మేరకు ప్రస్తుతం పర్యటనలో బిజీగా ఉన్నారు. ఏపీఈడీబీ, సీఐఐ, బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా సంయుక్తంగా నిర్వహించే ఆస్ట్రేలియా-ఏపీ సీఈవో రౌండ్ టేబుల్ సమావేశానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలోని కృష్ణపట్నం, విశాఖపట్నం, అనంతపురం ఇండస్ట్రియల్ క్లస్టర్లలో ఆస్ట్రేలియన్ కంపెనీలు భాగస్వామ్యం వహించేలా సహకారం అందించాలని కోరారు. నవంబర్ 14,15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే పార్టనర్ షిప్ సమ్మిట్ 2025కు ఫోరం నాయకత్వ బృందంతో కలసి హాజరు కావాల్సిందిగా మంత్రి లోకేష్ ఆహ్వానించారు.
IT Minister Nara Lokesh Australia Tour
ఇదిలా ఉండగా ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తోంది. ఈ సందర్బంగా ఆదివారం సచివాలయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు. వచ్చే నవంబర్ 14, 15 తేదీలలో రెండు రోజుల పాటు పెట్టుబడిదారులతో , పారిశ్రామికవేత్తలతో భాగస్వామ్య సదస్సును నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఏపీతో పాటు తెలంగాణ, దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలలో ఉన్న ప్రవాస ఆంధ్రులు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు సీఎం.
Also Read : Pawan Kalyan Important Comments on Diwali : దీపావళిని పర్యావరణ హితంగా జరుపు కోవాలి
















