Nara Lokesh : యుకె : ఏపీ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కీలక ప్రకటన చేశారు. ఆయన ప్రస్తుతం యునైటెడ్ కింగ్ డమ్ లో పర్యటిస్తున్నారు. ప్రవాసాంధ్రులతో ముచ్చటించారు. అంతకు ముందు ఇష్కాన్ టెంపుల్ కు వెళ్లారు. శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. అనంతరం సీఐఐ భాగస్వామ్య సమావేశానికి ముందు నారా లోకేష్ లండన్ పెట్టుబడిదారుల సదస్సును నిర్వహించారు. ఏపీకి సంబంధించి 2.4 ట్రిలియన్ ఆర్థిక దృక్పథాన్ని హైలైట్ చేశారరు. యన గ్రీన్, క్లస్టర్ ఆధారిత వ్యూహాన్ని వివరించారు. ప్రపంచ పెట్టుబడిదారులకు వేగవంతమైన, పారదర్శక పాలనకు హామీ ఇచ్చారు.
Nara Lokesh Key Comments
నవంబర్‌లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించాడు. పాల్ మాల్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమం రాష్ట్ర గ్లోబల్ ఔట్రీచ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించచడం జరిగింది. ఈ సందర్బంగా నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. లండన్‌లో మా సందేశం స్పష్టంగా ఉందన్నారు. దేశంలో ఏపీ అన్ని రంగాలలో టాప్ లో కొనసాగుతుందని స్పష్టం చేవారు. పెట్టుబడిదారులకు, పెట్టుబడులకు స్వర్గ ధామంగా మారనుందని చెప్పారు నారా లోకేష్. భారతదేశంలో వ్యాపారం చేయడానికి ఉత్తమ ప్రదేశంగా ఉందన్నారు. గత 15 నెలల్లో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో బలమైన విద్యా వ్యవస్థలు, నైపుణ్య కార్యక్రమాలు, అధునాతన పరిశోధన సౌకర్యాలు, పరిశ్రమ-నిర్దిష్ట పరీక్షా మౌలిక సదుపాయాల ద్వారా మద్దతు ఇవ్వబడిన సామర్థ్యం ఉందన్నారు. డేటా సెంటర్లు, సెమీ కండక్టర్లు, పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై దృష్టి సారించామన్నారు.
Also Read : Ram Gopal Varma Shocking Case : రామ్ గోపాల్ వర్మకు షాక్ కేసు నమోదు

















