Kirloskar : విశాఖపట్నం : భారత దేశంలో పేరు పొందిన పైపులు, మోటార్ల, సోలార్ ప్లాంట్ల తయారీ కంపెనీ కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ (కేబీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ కిర్లోస్కర్ (Kirloskar) సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో విశాఖపట్నం వేదికగా సీఐఐ భాగస్వామ్య సదస్సును నిర్వహిస్తంది. శుక్రవారంతో ప్రారంభమైన ఈ సదస్సు నేటి శనివారంతో ముగుస్తుంది. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున కంపెనీలు, సంస్థలు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సీఈఓలు, మేనేజింగ్ డైరెక్టర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ లు , ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఇప్పటికే దాదాపు రూ. 80 వేల కోట్లకు పైగా పెట్టుబడులు ఏపీకి వచ్చినట్టు సమాచారం. దిగ్గజ కంపెనీల ప్రతినిధులు సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తో భేటీ అయ్యారు.
Kirloskar Company Huge Investments in AP
ఇదిలా ఉండగా కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ (కెబిఎల్) ఎండి అలోక్ కిర్లోస్కర్ మంత్రితో కీలక చర్చలు జరిపారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, రెన్యువబుల్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా హైడ్రో టర్బైన్లు, సౌర పంపింగ్ వ్యవస్థల తయారీ యూనిట్ ను ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు నారా లోకేష్ ఎండీ అలోక్ కిర్లోస్కర్ ను. నీటిపారుదల, మునిసిపల్ నీటి సరఫరా, పారిశ్రామిక వినియోగానికి కీలకమైన వర్టికల్ టర్బైన్ పంపుల కోసం ఏపీలో ఒక ప్రత్యేక ప్లాంట్‌ను స్థాపించాలని సూచించారు. మంత్రి చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు కిర్లోస్కర్ కంపెనీ ఎండీ .దీని ద్వారా పెద్ద ఎత్తున ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని స్పష్టం చేశారు.
Also Read : AP-Singapore Important Agreement : ఏపీ ప్రభుత్వంతో సింగపూర్ సర్కార్ ఒప్పందం


















