Minister Komatireddy Fired on KCR : కాంగ్రెస్ దెబ్బ‌కు కేసీఆర్ ఖేల్ ఖ‌తం

మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కామెంట్స్

Hello Telugu - Minister Komatireddy Fired on KCR

Hello Telugu - Minister Komatireddy Fired on KCR

Minister Komatireddy : హైద‌రాబాద్ : రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి (Minister Komatireddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న బీఆర్ఎస్ పార్టీని, మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ స‌త్తా ఏపాటిదో చూపించామ‌న్నారు. దీంతో ముంద‌స్తు అంచ‌నాల‌కు పోయి ప్ర‌జ‌లలో చుల‌క‌నై పోయంద‌న్నారు. తాము చాప కింద నీరులా ఊహంచ‌ని షాక్ ఇచ్చామ‌న్నారు. గ‌తంలో కంటే భారీ మెజారిటీ త‌మ పార్టీ అభ్య‌ర్థి న‌వీన్ యాద‌వ్ కు వ‌చ్చింద‌న్నారు. దీంతో కేసీఆర్ క‌ల భ‌గ్నం అయ్యింద‌న్నారు. దీంతో దిక్కు తోచ‌క ఫామ్ హౌస్ కే ప‌రిమితం అయ్యారంటూ ఎద్దేవా చేశారు.

Minister Komatireddy Venkat Reddy Slams Ex CM KCR

ఇవాళ దేశంలో ఎక్క‌డా లేని విధంగా మ‌హిళ‌ల‌కు కోటి చీర‌లు పంపిణీ చేస్తున్నామ‌ని చెప్పారు. ఇది తొలి విడ‌త‌లో మాత్ర‌మేన‌ని మిగతా కోటి చీర‌ల‌ను త్వ‌ర‌లోనే రెండో విడ‌త సంద‌ర్బంగా ఇస్తామ‌న్నారు. త‌మ ప్ర‌జా ప్ర‌భుత్వం మ‌హిళ‌ల సాధికార‌త కోసం ప‌ని చేస్తుంద‌ని చెప్పారు. ఒక్కో మ‌హిళా కుటంబాన్ని కోటీశ్వురురాలిగా మార్చ‌డ‌మే సీఎం రేవంత్ రెడ్డి ముందున్న లక్ష్య‌మ‌న్నారు. ఆడబిడ్డకు సారె పెట్టిన విధంగా మహిళలకు చీర‌లు పంపిణీ చేస్తున్నాం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ముందుకెళ్తోందని చెప్పారు. దెబ్బ‌కు కేసీఆర్ లో వ‌ణుకు మొద‌లైంద‌న్నారు. జూబ్లీహాల్స్ ఓటమి, పార్లమెంటులో ఒక్క సీటు కూడా రాక పోవడంతో మానసికంగా బాధలో ఉన్నారంటూ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Also Read : Harish Rao Shocking Comments : టిమ్స్ ఆస్ప‌త్రులపై సీఎం నిర్ల‌క్ష్యం త‌గ‌దు

Exit mobile version