Minister Komatireddy : హైదరాబాద్ : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy) కీలక ప్రకటన చేశారు. శిక్షణ, ఉపాధి, నైపుణ్యంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నామని అన్నారు. హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (NAC) ఆధ్వర్యంలో, వారధి ట్రస్ట్ సహకారంతో ఉద్యోగావకాశాలతో కూడిన నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సివిల్ సూపర్వైజర్ , ఎలక్ట్రిషియన్ కోర్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం, నివాసం, వసతి సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు మంత్రి. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికేట్ తో పాటు ఉద్యోగావకాశాలు దక్కేలా చేస్తారని చెప్పారు.
Minister Komatireddy Venkat Reddy Key Comments
ఈ శిక్షణ కార్యక్రమం నవంబర్ 3 నుంచి హైదరాబాద్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (NAC) లో ప్రారంభం అవుతుందన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రాష్ట్ర యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిక్షణకు సంబంధించిన వివరాల కోసం 8008937800 / 9032504507 అనే నంబర్లలో కాంటాక్ట్ కావాలని సూచించారు. ఇదిలా ఉండగా తమ ప్రభుత్వం ప్రధానంగా యువతీ యువకులకు మెరుగైన రీతిలో శిక్షణ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇందులో భాగంగానే వివిధ రంగాలలో శిక్షణ ఇచ్చేలా ప్లాన్ చేశామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని రంగాలలో నైపుణ్యం పెంపొందించేలా యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరుగుతుందన్నారు.
Also Read : MEIL Shocking Tamilnadu : 250 మెగావాట్ల ప్లాంట్ ఎంఈఐఎల్ స్వాధీనం


















