Minister Komatireddy : హైదరాబాద్ – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy) సీరియస్ కామెంట్స్ చేశారు మంత్రి నారా లోకేష్ పై. తను చిన్న పిల్లోడని , తనకు ఇంకా రాజకీయ అనుభవం రాలేదన్నారు. తన గురించి మాట్లాడటం సబబు కాదన్నారు. తను నాకు సరిపోడన్నారు. బనకచర్ల నిర్మాణాన్ని అడ్డుకుని తీరుతామని ప్రకటించారు. అవసరమైతే కేంద్రంతో కొట్లాడుతామని వార్నింగ్ ఇచ్చారు. ఏపీ కావాలని తమతో కయ్యానికి కాలు దువ్వుతోందన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. మిగులు జలాలను వాడుకుంటామంటూ లోకేష్ , సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు లాంటి వాళ్లు పదే పదే చెప్పడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇప్పటికే తమకు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని , ఈ సమయంలో నీళ్లు తీసుకు పోతామని అంటే ఊరుకుంటామా అని ప్రశ్నించారు.
Minister Komatireddy Venkat Reddy Key Comments
కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ సర్కార్ డ్యూయల్ రోల్ పోషిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఆయా రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేయాలే తప్పా ఉన్నదాంట్లో రాయి వేసి చూస్తామంటే ఎలా అని నిలదీశారు. ఇది పూర్తిగా ఇరు రాష్ట్రాలకు సంబంధించి నీటి వాటాలను ఇప్పటికే తేల్చడం జరిగిందన్నారు. విచిత్రం ఏమిటంటే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సముద్రంలో వృధాగా పోయే నీటిని మాత్రమే వాడుకుంటామని, 200 టీఎంసీలేనంటూ చెప్పడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణ ఎడారి కావాలని అనుకుంటే ఎలా అని మండిపడ్డారు. ఇది తగదన్నారు.
Also Read : Komatireddy Raj Gopal Reddy Proven : సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతు ఇస్తా
















