Kandula Durgesh : అమరావతి : మొంథా తపాను తీవ్రతతో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. నిడదవోలులోని ఎర్ర కాలువ ఉధృతి పెరగనున్న నేపథ్యంలో గట్ల వెంబడి రెండు లారీల లోడ్ తో కూడిన ఇసుక బస్తాలు పెట్టి ముందస్తు చర్యగా ముంపును అరికట్టేందుకు శ్రీకారం చుట్టారు మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh). ఎర్రకాలువ ముంపుకు గురి కాకుండా కంసాలి పాలెం వద్ద ఆయకట్టు కట్టేందుకు మంత్రి దుర్గేష్ ఆదేశాలతో రంగంలోకి దిగారు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. ఎర్ర కాలువ ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుండాలని, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికార యంత్రాంగం, నాయకులు అప్రమత్తతతో ఉన్నామని ఏ చిన్న సమస్య వాటిల్లకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు మంత్రి కందుల దుర్గష్.
Minister Kandula Durgesh Key Comments on Red Canal
ఇదిలా ఉండగా మొంథా” తుఫాన్ ప్రభావం దృష్ట్యా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలను సమర్థవంతంగా అమలు చేస్తూ వచ్చామన్నారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలకు తగిన భద్రత, తాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు, అవసరమైన వసతులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయా అనే అంశంపై అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నాను. ప్రజలతో మాట్లాడి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని స్థానిక అధికారులను ఆదేశించారు మంత్రి.
Also Read : R Ashoka Shocking Comments : కర్ణాటకలో సీఎం మార్పు ఖాయం : అశోక
















