Minister Gottipati Important Update : సోలార్ విద్యుత్ సామ‌ర్థ్యం 78.50 గిగావాట్ల‌కు పెంచుతాం

శాస‌న స‌భ‌లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్

Hello Telugu - Minister Gottipati Important Update

Hello Telugu - Minister Gottipati Important Update

Minister Gottipati : అమ‌రావ‌తి : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ (Minister Gottipati) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు ఏపీ శాస‌న స‌భ‌లో. ప‌లువురు స‌భ్యులు అడిగిన ప్ర‌శ్నాల‌కు గురువారం ఆయ‌న స‌మాధానం ఇచ్చారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 5006.35 మెగావాట్లుగా ఉందన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు రాష్ట్రం ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ను తీసుకొచ్చిందని మంత్రి చెప్పారు. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలో సోలార్ విద్యుత్ సామర్థ్యాన్ని 78.50 గిగావాట్లుకు పెంచే దిశగా అడుగులు వేస్తున్నామ‌ని పేర్కొన్నారు. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూల్, కేజీబీవీ వసతి గృహాల్లో 2,138 KW సామర్థ్యంతో రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేశామ‌ని వెల్ల‌డించారు.

Minister Gottipati Ravi Kumar Interesting Update

PM SHRI పథకం క్రింద గ్రిడ్ అనుసంధానిత రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటుకు ప్రణాళికలు త‌యారు చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు గొట్టిపాటి ర‌వికుమార్. ఈ ప‌థ‌కం ద్వారా 3,550 KW ఉత్పత్తి లక్ష్యంతో 415 పాఠశాలల్లో ఏర్పాటుకు టెండర్లు పిలిచామ‌ని చెప్పారు. పీఎం సూర్యఘర్ కు బ్యాంకర్లు మద్దతు కోసం ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందన్నారు. సూర్యఘర్ కు సహకరించాలని సీఎం చంద్రబాబు నాయుడు బ్యాంకర్ల సమావేశం లో కోరార‌ని వెల్ల‌డించారు. ప్రభుత్వ భవనాలపై రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేశామ‌న్నారు. త్వరలోనే గ్రామ స్థాయిలో పంచాయతీ భవనాలపై సోలార్ రూఫ్ టాప్ లను ఏర్పాటు చేస్తామ‌న్నారు. ప్రభుత్వ భవనాలపై 130 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామ‌ని మంత్రి ప్ర‌క‌టించారు.

Also Read : Minister Nara Lokesh Interesting Update : నేపాల్ నుంచి ఏపీ వాసుల‌ను ర‌క్షించిన లోకేష్

Exit mobile version