BC Janardhan Reddy : నంద్యాల జిల్లా – రైతులకకు యూరియా కొరత లేకుండా చేస్తున్నామని అన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (BC Janardhan Reddy). నంద్యాల జిల్లాలోని బనగాన పల్లెలో గురువారం యూరియా కృత్రిమ కొరతపై మంత్రి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. రైతులకు అసరమైన మేర యూరియాను అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. యూరియా సరఫరా విషయంలో రైతుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నంద్యాల జిల్లాలో యూరియా కృత్రిమ కొరత ఉన్నట్లు వస్తున్న ప్రచారంపై సీరియస్ గా స్పందించారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇప్పటికే యూరియాకు సంబంధించి కేంద్రంతో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారని అన్నారు.
Minister BC Janardhan Reddy Key Comments
రైతుల యూరియా కొరత అంశంపై సకాలంలో స్పందించామన్నారు.ఈ విషయాన్ని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని చెప్పారు బీసీ జనార్దన్ రెడ్డి. త్వరలో నంద్యాల జిల్లాకు 10 వేల మెట్రిక్ టన్నులు యూరియా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కృత్రిమ కొరతను నివారించేందుకు రైతులు అవసరం మేరకే యూరియాను కొనుగోలు చేయాలని పిలుపనిచ్చారు బీసీ జనార్దన్ రెడ్డి. ఈ ఏడాది ముందస్తుగా వర్షాలు పడ్డాయని , ప్రభుత్వ చొరవతో ముందుగా సాగు నీరు విడుదల కావడంతో అంచనాకు మించి జిల్లాలో సాగు పెరిందన్నారు. పంట సాగు విస్తీర్ణం పెరగడంతో అభద్రతభావంతో అవసరానికి మించి యూరియాను కొనుగోలు రైతులు కొనుగోలు చేశారని తెలిపారు బీసీ జనార్దన్ రెడ్డి. దీని వల్ల నిజమైన రైతులకు ఇబ్బంది ఏర్పడుతోందన్నారు.
Also Read : Popular Actress Shweta Menon : అశ్లీల చిత్రాల కేసును పక్కన పెట్టాలి

















