Minister Atchannaidu : అమరావతి : రాష్ట్రంలోని పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలపై మంచి పురోగతి జరుగుతోందని వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక, మార్కెటింగ్, పాల, మత్స్య శాఖల మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) స్పష్టం చేశారు. గతంలో లేఖ ద్వారా కేంద్రానికి సూచించిన ఆరు కీలక అంశాలపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మూడు అంశాల అమలు ప్రక్రియను ప్రారంభించిందన్నారు. దీనివల్ల పత్తి కొనుగోలులో ఏర్పడిన సమస్యలు పరిష్కారం వైపు సాగుతున్నాయని తెలిపారు. కొనుగోలు కేంద్రాలు కూడా దశల వారీగా ప్రారంభమయ్యాయని, కొనుగోలు ప్రక్రియ మొదలైందని పేర్కొన్నారు. అయితే మోంథా తుఫాన్ ప్రభావంతో పత్తి నాణ్యత సి.సి.ఐ నిర్దేశించిన ప్రమాణాలకు విరుద్ధంగా ఉండటంతో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో ఉంచుకొని, మిగిలిన మూడు అంశాలైన L1, L2, L3 జిన్నింగ్ మిల్లులను ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
Minister Atchannaidu Key Comments
వాతావరణం కారణంగా తేమ శాతం 12% నుండి 18% వరకు ఉన్న పత్తిని అనుపాత తగ్గింపులతో కొనుగోలు చేయడం, వర్షానికి తడిసిన లేదా రంగు మారిన పత్తిని తగిన ధర తగ్గింపులతో కొనుగోలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ అంశాల ప్రాధాన్యతను వివరించి, రైతులకు తక్షణ ప్రయోజనం కలిగేలా చూడాలని అభ్యర్థించినట్లు వెల్లడించారు. ఈ సమావేశంపై కేంద్ర టెక్స్టైల్ మంత్రి గిరిరాజ్ సింగ్ సానుకూలంగా స్పందించారని, త్వరలో అనుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశముందని వెల్లడించారు. రైతుల సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకూ నిరంతరం అనుసరిస్తాం, కేంద్రం నుండి మంచి ఫలితాలు వచ్చేలా కృషి చేస్తాం అని మంత్రి హామీ ఇచ్చారు.
Also Read : CP VC Sajjanar Huge Support : మహిళా జర్నిలిస్టులకు సజ్జనార్ భరోసా


















