Minister Atchannaidu : ఢిల్లీ – ఏపీలో వ్యవసాయ రంగ అభివృద్దికి సహకరించాలని కేంద్ర మంత్రి శివ రాజ్ సింగ్ చౌహాన్ ను కోరారు మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu). మంగళవారం ఢిల్లీలో సోదరుడి తనయుడు, కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా రాష్ట్రంలో రైతుల సమస్యలపై ప్రత్యేకంగా ప్రస్తావించారు.
Minister Atchannaidu Requests Union Minister Shivraj Singh Chouhan
వ్యవసాయ రంగ సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు అచ్చెన్నాయుడు.
మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. తొతాపురి మామిడి ధర తగ్గడంతో రైతులకు నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ధర రూ.8కి పడి పోవడంతో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు కేంద్ర మంత్రికి. ధరల లోటు చెల్లింపు పథకం కింద మద్దతు ధరగా రూ.12 నిర్ణయించినట్లు వివరణ ఇచ్చారు.
6.5 లక్షల మెట్రిక్ టన్నుల తొతాపురి కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.260 కోట్లు ఖర్చు చేస్తుందని చెప్పారు. కేంద్ర భాగస్వామ్యం కోరారు అచ్చెన్నాయుడు. అంతే కాకుండా వెనుకబడిన జిల్లాల కోసం మైక్రో ఇరిగేషన్ పథకానికి రాయితీ పెంచాలని విన్నవించారు. బుందేల్ఖండ్ తరహాలో ఏపీకి కేంద్రం అదనపు సాయం చేయాలని కోరారు. గుంటూరులో చిల్లీ బోర్డ్, శ్రీకాకుళంలో జీడిపప్పు బోర్డ్, చిత్తూరు లో మామిడి బోర్డ్ ను ఏర్పాటు చేయాలన్నారు. విభజన చట్టం ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్నారు.
Also Read : YSR Death Anniversary-YS Jagan : వైఎస్సార్ జీవితం చిరస్మరణీయం – వైఎస్ జగన్
















