Minister Atchannaidu : విజయవాడ – రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రైతులకు అందుబాటులో ఎరువులు ఉంచాలని స్పష్టం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu). కొరత సంభవించే అవకాశం ఉంటే ముందుగానే గ్రహించి ఎరువుల సరఫరా పెరిగేలా వ్యవసాయ అధికారులు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఎరువులు, వాటి సరఫరా, కొన్ని ప్రాంతాలలో యూరియా సరఫరాపై అందుతున్న సమాచారం పై విజయవాడలో వ్యవసాయ అధికారులు, జిల్లా కలెక్టర్లతో మంత్రిటెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ రైతు ఎరువుల కోసం ఇబ్బంది పడకూడదన్నారు. ప్రతి ఒక్కరికీ ఎరువులు అందుతున్నాయో లేదో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా ముందు చూపుతో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తో సంప్రదించి మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ పరిమాణంలో ఎరువులను రాష్ట్రానికి తెప్పించిందన్నారు.
Minister Atchannaidu Key Comments
అయినా కూడా పలు ప్రాంతాలలో ఎరువుల కొరత ఉందంటూ తనకు ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu). శ్రీకాకులం జిల్లాలో ఎరువుల కొరత అంటూ వచ్చిన వార్తలపై కలెక్టర్ ను మంత్రి ప్రశ్నించగా వంశధార ప్రాజెక్టు లో ముందుగా నీటిని విడుదల చేయడం వల్ల విస్తీర్ణం పెరిగిందని చెప్పారు. జిల్లాకు 12000 మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరం ఉందని అందుకు గాను 18000 మెట్రిక్ టన్నుల ఎరువులు (9000 సొసైటీలు+ 9000 ప్రైవేట్ కంపెనీలకు) అందుబాటులో ఉన్నాయని స్వప్నీల్ దినకర్ వివరించారు. రైతులు ప్రైవేట్ డీలర్ల వద్ద ఎరువులు కొనటానికి విముఖత చూపిస్తున్నారని , రైతు సేవా కేంద్రాలకు ఎరువులు అందించాలని కోరుతున్నారని తెలిపారు.
గతంలో ఎరువుల తక్కువ అవసరం ఉన్న ఆర్ ఎస్ కే (RSK) లకు ఎక్కువ మొత్తంలో ఎరువులు పంపిణీ చేశారని తెలిపారు. ప్రభుత్వ కోటా 50 శాతం ఎరువులు మన్యం, విజయనగరం జిల్లాల సొసైటీలు, ఆర్ ఎస్ కే (RSK) లకు వెళ్తున్నాయని, శ్రీకాకుళం జిల్లాకు ప్రైవేట్ డీలర్ లకు వెళ్తున్నాయని చెప్పారు. కాగా జూలై, ఆగస్ట్ నెలలకు సంబంధించి రాష్ట్రానికి రావల్సిన బకాయి ఎరువులను వెంటనే రాష్ట్రానికి పంపాలని కేంద్రాన్ని కోరడం జరిగిందని వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావు మంత్రికి వివరించారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తో మాట్లాడి త్వరితగతిన యూరియాను రాష్ట్రానికి వచ్చేలా చొరవ చూపుతామని అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను రైతులు నమ్మొద్దని కోరారు.
Also Read : Hydraa-AV Ranganath Alarming : సహాయక చర్యలు ముమ్మరం చేయండి


















