Minister Atchannaidu : పశు సంవర్దక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై దృష్టి సారించామని చెప్పారు మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu). శుక్రవారం శాసన సభ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. భర్తీ చేసేంత వరకు రాష్ట్రంలో పశు వైద్యానికి ఇబ్బందులు ఎదుర్కోకూడదని ప్రత్యామ్నాయంగా గ్రామ స్థాయిలో దాదాపుగా 6137 మంది వెటర్నరీ అసిస్టెంట్స్ ద్వారా వైద్య సేవలు అందచేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పశు వైద్యుడు లేడనే మాట రాకుండా, పశు వైద్యానికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లను చేశామన్నారు. ప్రస్తుతానికైతే ఏ సమస్య లేకుండా చర్యలు చేపట్టామని వెల్లడించారు. పశుసంవర్ధక సహయకులు గ్రామ స్థాయిలో రైతు సేవా కేంద్రాల్లో చురుగ్గా పనిచేస్తున్నారని, అందుబాటులో ఉన్న పశువైద్యుల సాంకేతిక మద్దతుతో సేవలు అందిస్తున్నారని అన్నారు.
Minister Atchannaidu Key Update
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ల 293 ఖాళీలు భర్తీ చేసేందుకు 258 పోస్టులను నిర్ధారించి ఆర్ధిక శాఖకు ప్రతిపాదించడం జరిగిందని మంత్రి అచ్చెన్న (Minister Atchannaidu) తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని 24.84 కోట్లతో ప్రతిపాదనలు సత్వరమే చేపట్టాలని తెలియజేశామని, ఆదేశాలు రాగానే రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా తిరుపతిలోని వెంకటేశ్వర పశు వైద్యశాలలో అండర్ గ్రాడ్యుయేషన్ , పీజీ, పిహెచ్డి విద్యార్థులకు అందచేసే స్టైఫండ్ చివరిసారిగా 2013 వ సంవత్సరంలో పెంచడం జరిగిందని, పది సంవత్సరాల తర్వాత కూటమి ప్రభుత్వంలోనే ఇటీవలే ఈ మూడు విద్యార్థులకు స్టైఫండ్ కూడా పెంచడం జరిగిందన్నారు. ప్రస్తుతం యూజీ విద్యార్ధులకు 7000 నుంచి 10,500 , పీజీ వాళ్లకు 9000 నుండి 13,500 , పీహెచ్డీ వాళ్లకి 10,000 నుండి 15,000 రూపాయలకు పెంచి వారి చదువుకి ఇబ్బంది లేకుండా చేశామన్నారు.
రాష్ట్రంలో కొన్ని పశు వైద్యశాలలు మరమ్మత్తులకు గురయ్యాయని, కొన్ని చోట్ల ప్రైవేట్ బిల్డింగులలో హాస్పిటల్స్ నిర్వహిస్తున్నారన్న విషయం తన దృష్టికి వచ్చిందని మంత్రి అచ్చెన్న తెలిపారు. ఆధునీకరణ చేయాల్సిన పశు హస్పిటల్స్ ఎన్నో గుర్తించి, 434 పశు హాస్పిటల్స్ కి భవనాలు అవసరమని ఇందుకు ఆర్ ఐ డీఎఫ్ కింద, నాబార్డ్ కి ప్రతిపాదనలు పంపించామని, త్వరితగతిన అనుమతులు పొంది పనులు పూర్తిచేస్తామని తెలిపారు.
Also Read : GST Important Update : జీఎస్టీ కొత్త రేట్లతో గ్రామీణ కుటుంబాలకు ఊరట
