Minister Atchannaidu : అమరావతి : మొంథా తుపాను తీరం దాటింది. పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. మరో వైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రివ్యూ చేశారు. మంత్రులు నారా లోకేష్, నారాయణ, అనిత, నిమ్మల రామా నాయుడు, నాదెండ్ల మనోహర్ లు ఎప్పటికప్పుడు తుపాను పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఇంకో వైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కలెక్టర్లతో మాట్లాడుతున్నారు. మరికొందరు మంత్రులు జిల్లాలలోనే ఉంటూ సహాయక చర్యలపై ఫోకస్ పెట్టారు.
Minister Atchannaidu Key Comments
వారిలో వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu), పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ తో పాటు ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఉన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తుపాను తీవ్రత గురించి ఉన్నతాధికారులతో ఆరా తీశారు. మొంథా తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు యంత్రాంగం అంతా సిద్ధంగా ఉండాలని డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.విద్యుత్, తాగునీటి సరఫరాకు అంతరాయం లేకండా చూడాలని,పరిస్థితి అంచనా వేసి తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు.
Also Read : Minister Kandula Durgesh Important Update : ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి
















