Minister Atchannaidu : అమరావతి – కూటమి ప్రభుత్వం అన్నదాతల సంక్షేమం కోసం ప్రయత్నం చేస్తోందని చెప్పారు మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu). మంగళవారం వినుకొండ, ఈపూరు మండలాల మార్కెట్ యార్డ్ కమిటీల ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా పెద్ద ఎత్తున సాగు చేశారని తెలిపారు. ఇదే సమయంలో ఆశించిన మేర ఎరువులు దొరకడం లేదంటూ వైసీపీ చేస్తున్నా ప్రచారం పూర్తిగా అబద్దమన్నారు అచ్చెన్నాయుడు. రైతులకు ఉపయోగకరమైన మెగా కిసాన్ మేళాను నిర్వహిస్తున్నామన్నారు. గత సర్కార్ వ్యవసాయ రంగాన్ని విస్మరించిందని ఆరోపించారు. ఇందులో 150 కి పైగా విత్తన, ఎరువుల కంపెనీలు పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
Minister Atchannaidu Key Comments on Farmers
కానీ తెలుగుదేశం పార్టీ 43 ఏళ్లుగా ప్రజల పక్షాన ఉంటూ సేవ చేస్తోందని చెప్పారు. వైసీపీ లా గాలికి పుట్టిన పార్టీ కాదన్నారు. గత ఐదేళ్లు రాష్ట్రంలో భయానక పరిస్థితులు, ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం, ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపాడు జగన్ రెడ్డి అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిందన్నారు. ఈ విజయం కార్యకర్తల త్యాగాల ఫలితంగా వచ్చిందన్నారు. వైసీపీ పాలనలో 12 లక్షల కోట్ల అప్పు చేసి ప్రజల నెత్తిన గుదిబండ మోపాడంటూ సంచలన ఆరోపణలు చేశారు కింజారపు అచ్చెన్నాయుడు. చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి , సంక్షేమంతో ముందడుగు వేస్తున్నామన్నారు. ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని స్పష్టం చేశారు.
Also Read : Home Appliances Price Drop : ఏసీలు, టీవీలపై ధరలు మరింత తగ్గించే దిశగా కేంద్ర సర్కార్

















